అన్ని రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నాం

అన్ని రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నాం

హైదరాబాద్ : అన్ని రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు హరీశ్ రావు. దళితుల బతుకుల్లో వెలుగు నింపేందుకే దళిత బంధు స్కీం తీసుకొచ్చామన్నారు. మంగళవారం కోఠి కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆఫీసులో సర్కార్ హాస్పిటల్స్ లోని కాంట్రాక్ట్ ఏజెన్సీ ఎస్సీలకు 16శాతం రిజర్వేషన్ ప్రకియను మంత్రి హరీశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..దళితుల కోసం నాడు అంబేద్కర్ కన్న కలలను నేడు సీఎం కేసీఆర్ నిజం చేశారన్నారు. గతంలో నీటిపారుదల శాఖలో జరిగే టెండర్లలో 21% ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తూ జీవో 59 విడుదల చేసిన ఘనత సీఎం కేసీర్‌ది అన్నారు. ఇప్పటికే వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయన్న హరీష్.. 300కు పైగా షాపుల్లో గల్లాపెట్టె ల మీద దళితులు కూర్చున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మెడికల్ షాపుల్లో కూడా దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.  ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో శానిటేషన్ & సెక్యూరిటీ, డైట్ ఏజెన్సీల్లో 16% దళితులకు కేటాయిస్తున్నామని తెలిపారు. వంద పడకల లోపు హాస్పిటల్‌ను ఒక కేటగిరిగా.. వంద పడకలకు పైగా ఉన్న హాస్పిటల్ ను మరో కేటగిరిగా విభజించామన్నారు. ఏయే హాస్పిటల్లను రిజర్వ్ చేయాలో డ్రా ద్వారా పారదర్శకంగా నిర్ణయిస్తామన్నారు. మొత్తం 56 హాస్పిటల్ లను దళితులకు కేటాయించామని..  వీటికి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు హరీష్.

హరీశ్ ట్వీట్: తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపాలి

సైంటిస్టుల కంటే రైతులకే బాగా తెలుసు