కవ్వాల్ టైగర్ జోన్ లో ట్రైనీ ఆఫీసర్ల పర్యటన

కవ్వాల్ టైగర్ జోన్ లో ట్రైనీ ఆఫీసర్ల పర్యటన

జన్నారం, వెలుగు: హైదరాబాద్​లోని దూలపెల్లి ఫారెస్ట్ అకాడమీకి చెందిన 16 మంది ట్రైనీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు బుధవారం కవ్వాల్ టైగర్ జోన్ లో పర్యటించారు. టైగర్ జోన్​లోని వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన నీటి కుంటలు, గ్రాస్ ల్యాండ్ ను పరిశీలించారు.

అడవిలో చేపడు తున్న అభివృద్ధి పనులను స్థానిక ఫారెస్ట్ ఆఫీసర్లు వారికి వివరించారు. తాళ్లపేట, జన్నారం రేంజ్ లకు చెందని ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.