- కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి నామినేషన్ వేసిన పలువురు ఆశావహులు
మెదక్/సంగారెడ్డి/ సిద్దిపేట, వెలుగు: మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో మొత్తం 75 వార్డు స్థానాలకు తొలి రోజు బుధవారం 26 నామినేషన్లు దాఖలయ్యాయి. మెదక్ మున్సిపాలిటీలో వివిధ వార్డులకు 12 మంది నామినేషన్ వేశారు.
వీరిలో కాంగ్రెస్‌నుంచి 5, బీఆర్ఎస్నుంచి 5, బీజేపీ నుంచి 2, రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్‌నుంచి 5, బీఆర్ఎస్ నుంచి 1, ఇండిపెండెంట్1, తూప్రాన్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నుంచి 2, బీజేపీ నుంచి 2, నర్సాపూర్మున్సిపాలిటీలో కాంగ్రెస్‌నుంచి 1, ఇండిపెండెంట్లు ఇద్దరు నామినేషన్ వేశారు.
సంగారెడ్డి జిల్లాలో 99..
జిల్లాలో మొదటి రోజు 99 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 11 మున్సిపాలిటీలు, 256 వార్డులున్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 9, బీజేపీ 1, బీఎస్పీ 1, ఇతరులు 1, సదాశివపేటలో కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 5, బీజేపీ 4, జహీరాబాద్ లో బీఆర్ఎస్ 3, బీజేపీ 1, నారాయణఖేడ్ లో కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 3, బీజేపీ 1 ఇతరులు 1, జిన్నారంలో బీఆర్ఎస్ 2, ఇతరులు 1, గడ్డపోతారం మున్సిపాలిటీలో కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1, గుమ్మడిదలలో కాంగ్రెస్ 3, బీజేపీ 3, అందోల్-జోగిపేటలో కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 4, బీజేపీ 7, ఇంద్రేశం మున్సిపాలిటీలో కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 1, బీజేపీ 1, ఇస్నాపూర్ లో కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 1, బీజేపీ 2 నామినేషన్లు దాఖలయ్యాయి. కోహిర్ మున్సిపాలిటీలో మొదటి రోజు ప్రధాన పార్టీలు ఇతరుల నుంచి ఒక్క నామినేషన్ కూడా రాలేదు. కలెక్టర్ ప్రావీణ్య పలు నామినేషన్సెంటర్లను తనిఖీ చేసి, అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు.
సిద్దిపేట జిల్లాలో 35..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొదటి రోజు 35 నామినేషన్లు దాఖలయ్యాయి. చేర్యాల మున్సిపాలిటీలో 5, హుస్నాబాద్ లో 4, గజ్వేల్‌లో 8, దుబ్బాకలో 18 మంది నామినేషన్‌వేశారు. పలు నామినేషన్సెంటర్లను కలెక్టర్ హైమావతి, ఎలక్షన్జనరల్ ఆబ్జర్వర్ ఆయేషా మస్రత్ ఖానమ్పరిశీలించారు. నిబంధనల ప్రకారం నామినేషన్లు స్వీకరించాలని సూచించారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులున్నా 90141 92463 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని చెప్పారు.
