
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ ద్వారా 164 సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం తన ఆఫీస్లో ఎస్పీ వివరాలు వెల్లడించారు. పోగొట్టుకున్న, చోరీ అయిన ఫోన్లను సీఈఐఆర్ ద్వారా రికవరీ చేశామన్నారు. 164 సెల్ఫోన్ల విలువ సుమారు రూ. 27 లక్షలు ఉంటుందన్నారు. ప్రతి నెలా 150కి పైగా సెల్ఫోన్లను రికవరీ చేస్తున్నామన్నారు.
సెల్ఫోన్ల రికవరీ కోసం జిల్లా పోలీసు ఆఫీస్లో రిజర్వు ఎస్సై బాల్రాజు ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1,679 సెల్ఫోన్లను రికవరీ చేశామని, వీటి విలువ రూ. 2 కోట్ల 53 లక్షల వరకు ఉంటుందన్నారు. అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యారెడ్డి, డీఎస్సీ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు