దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో తగ్గిన కరోనా కేసులు
  • దేశంలో తగ్గిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో 16,866 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 4 వేలకు పైగా తగ్గడం విశేషం. అయితే ఆదివారం కావడంతో టెస్టుల సంఖ్య తగ్గినందున పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గినట్లు తెలుస్తోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గినా.. పాజిటివిటీ రేటు 7.03 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ప్రస్తుతం లక్షన్నరకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో 18,148 వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ కాగా.. 41 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4 కోట్ల 39 లక్షల మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా.. వీరిలో 4 కోట్ల 32 లక్షల మంది కోలుకున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ల పంపిణీ కొనసాగుతోంది. ఆదివారం 16 లక్షల 8వేల మంది టీకా  తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్లు తీసుకున్న వారి సంఖ్య 202 కోట్లకు చేరింది.