కాంగోలో కుండపోత వర్షం.. కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి

కాంగోలో కుండపోత వర్షం..  కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి

కాంగోలో కుండపోత వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి దాదాపు 17 మంది మరణించారు. వాయువ్య మంగల ప్రావిన్స్‌లోని లిసాల్ పట్టణంలో కాంగో నది వెంబడి ఈ విపత్తు జరిగింది.

వాయువ్య కాంగోలో కుండపోత వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు, కూలిపోయిన ఇళ్ల క్రింద ఉన్న శిథిలాల్లో మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అంచనా వేశారు. బాధితులు పర్వతం దిగువన నిర్మించిన ఇళ్లలో నివసిస్తున్నారని సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఫోర్సెస్ వైవ్స్ అధ్యక్షుడు మాథ్యూ మోల్ తెలిపారు.

"ఒక కుండపోత వర్షం చాలా నష్టాన్ని కలిగించింది, కొండచరియలు విరిగిపడటం అనేక ఇళ్ళ కూలిపోయాయి" మాథ్యూ మోల్ చెప్పారు. "మృతదేహాలు ఇప్పటికీ శిథిలాల కింద ఉన్నందున మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని" అని తెలిపారు. శిథిలాలను తొలగించడానికి, ప్రాణాలతో బయటపడిన వారిని రక్షించడానికి యంత్రాలు చాలా అవసరమని గవర్నర్ సీజర్ లింబయా బంగిసా అన్నారు. గవర్నర్ బాధిత కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు.