మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ఇటీవల మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణల వాహనాలపై దాడి కేసులో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది.
శుక్రవారం మంచిర్యాల జిల్లా కోర్టులో సుమన్ తరఫు అడ్వకేట్లు, ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి తీర్పును సోమవారానికి వాయిదా వేశారు. మరో వైపు సుమన్‌ను కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కవిత రద్దు చేశారు.
