ఢిల్లీలో వర్షం.. 17 విమానాలు మళ్లింపు

ఢిల్లీలో  వర్షం.. 17 విమానాలు మళ్లింపు

ఢిల్లీలో ఈదురు గాలుతులతో కూడిన వర్షం కారణంగా  17 విమానాల దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు  అధికారులు.  ఒక్కసారిగా వాతావరణం మారడంతో పాటూ బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడటంతో  దేశంలోని పలు  ప్రాంతాల నుంచి ఢిల్లీ వచ్చే 17 విమానాలను మార్చి 30 సాయంత్రం నుంచి దారి మళ్లించారు.  ఎనిమిది లక్నో, ఎ నిమిది జైపూర్, ఒక విమానాన్ని డెహ్రడూన్ కు మళ్లించారు. మళ్లించిన విమానాల సమాచారం కోసం  ప్రయాణికులు ఎదురు చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలో వర్షాల  కారణంగా రోడ్లు మొత్తం   నిండిపోయాయి. రాకపోకలకు ఇబ్బంది కరంగా మారింది.   మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

 

https://twitter.com/DelhiAirport/status/1635701904767418368