ఒడిశా ఎన్నికల బరిలో 17 మంది కోటీశ్వరులు

ఒడిశా ఎన్నికల బరిలో 17 మంది కోటీశ్వరులు
  • ది అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రీఫార్మ్స్​ నివేదికలో వెల్లడి

భువనేశ్వర్: ఒడిశాలోని నాలుగు లోక్ సభ స్థానాల్లో పోటీచేస్తున్న 37 మంది అభ్యర్థుల్లో 17 మంది కోటీశ్వరులేనని ది అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రీఫార్మ్స్​(ఏడీఆర్) నివేదిక పేర్కొన్నది. ఇక్కడ మే 13న పోలింగ్​ జరుగనున్నది. నబరంగ్​పూర్, బెర్హంపూర్, కోరాపుట్, కలహండి లోక్​సభ స్థానాలనుంచి బరిలో నిలిచిన 37 మంది తమ అఫిడవిట్​లో ఆస్తుల వివరాలు వెల్లడించారు. వీరిలో 17 మంది (46%) రూ. కోటి కంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నారని ఏడీఆర్​ నివేదిక వెల్లడించింది. బీజేపీ, బీజేడీ క్యాండిడేట్లు అందరూ కోటీశ్వరులే కావడం గమనార్హం. ముగ్గురు కాంగ్రెస్​ అభ్యర్థులు, నలుగురు స్వతంత్రులు, ఒకరు భారతీయ వికాస్​ పరిషత్​, నవ భారత నిర్మాణ సేవా పార్టీనుంచి మరొకరు కూడా కోటికిపైగా ఆస్తిని కలిగి ఉన్నారని నివేదిక పేర్కొన్నది. కాగా, కలహండి లోక్​సభ బరిలో నిలిచిన బీజేపీ క్యాండిడేట్ మాలవిక దేవి రూ.41.89 కోట్ల సంపదతో అందరికంటే ధనవంతురాలిగా నిలిచారు.