ఈజిప్టులో 17 మంది మృతి

ఈజిప్టులో 17 మంది మృతి

కైరో: ఈజిప్టులోని సోహాగ్ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంగళవారం అర్ధ రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. జుహైనా జిల్లాలో హైవేపై ఓ మినీ బస్సు, ట్రక్కును  బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారని.. మరో నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతదేహాలను తీసుకువెళ్లడానికి అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఘటనాస్థలికి చేరుకున్నాయని వెల్లడించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించినట్లు వివరించారు.

అయితే, ఈజిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏటా రోడ్డు ప్రమాదాల లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్లు అధ్వానంగా ఉండటం, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చట్టాలను సరిగా అమలు చేయపోకవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. పోయిన నెల కూడా అక్కడ ఓ బస్సు.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలోనూ 23 మంది చనిపోయారు.