వరంగల్ లో 170  మంది మెడికల్​ స్టూడెంట్ల రక్తదానం

వరంగల్ లో 170  మంది మెడికల్​ స్టూడెంట్ల రక్తదానం

వరంగల్​సిటీ, వెలుగు :  నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకతీయ వైద్య కళాశాల విద్యార్థులు గురువారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్  డా. మోహన్ దాస్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వి చంద్రశేఖర్, కేఎంసీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ మెడికల్​ కౌన్సిల్​ వైస్ చైర్మన్ డా. జి శ్రీనివాస్ , సభ్యుడు డాక్టర్ వి నరేశ్​ హాజరయ్యారు.

ఈ కార్యక్రమం లో ఆర్ ఎం ఓ లు డాక్టర్ ప్రసాద్,  డాక్టర్ అభిలాష్,  డాక్టర్ ఆశా,  జుడా స్టేట్​ చైర్​పర్సన్​  డాక్టర్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.