
హైదరాబాద్, వెలుగు: ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటున్న టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చామని, మంగళవారం నాటికి 1.75 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది.
ఎన్నికల విధుల్లో పాల్గొనే టీచర్లు, ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించేలా ఈసీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్‌ల డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనే టీచర్లు, ఎంప్లాయిస్‌కు పోస్టల్ బ్యాలెట్స్ పంపిణీ అయ్యిందని, మంగళవారం నాటికి 1.75 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్స్‌ను వినియోగించుకున్నారని చెప్పారు. ఈ వాదనలతో సంతృప్తి చెందిన హైకోర్టు పిటిషన్‌పై విచారణను ముగించింది.