
ఖిల్లాగణపురం, వెలుగు: ఖిల్లాగణపురం మండలం కమాలుద్దీన్పూర్ గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 18 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై సురేశ్ గౌడ్ తెలిపారు. గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారంతో తహసీల్దార్ బి. సుగుణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఆన్లైన్ వే బిల్లులు లేకుండా ఇసుకతో లోడ్ అయిన 18 ట్రాక్టర్ ట్రాలీలను గుర్తించి పోలీసులుకు సమాచారమిచ్చారని తెలిపారు. తహసీల్దారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టరు యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.