రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి అందించే సాయం కోసం భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి. బుధవారం సాయంత్రానికి 1.85 లక్షల మంది దరఖాస్తు చేసుకు న్నారు. వీరిలో 1.35 లక్షల మంది టీచర్లుండగా, మరో 50 వేల మంది సిబ్బంది ఉన్నారు. గురువారంతో అప్లికేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికే వచ్చిన అప్లికేషన్లను మండల స్థాయిలో ఎంఈఓలు వెరిఫై చేస్తున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలోనూ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ నెల 20 నుంచి 24 వరకు అర్హులకు రూ.2 వేల సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 21 నుంచి 25వ తేదీ వరకు 25 కిలోల సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డు లేని వారు దగ్గరలోని రేషన్షాప్ నంబర్ ఇస్తే, అక్కడ బియ్యాన్ని తీసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
