ఫిలిప్పీన్స్‌ లో భారీ భూకంపం..భవనాలు, బ్రిడ్జీలు నేలమట్టం..సునామి వస్తుందా?

ఫిలిప్పీన్స్‌  లో భారీ భూకంపం..భవనాలు, బ్రిడ్జీలు నేలమట్టం..సునామి వస్తుందా?

ఫిలిప్పీన్స్​ లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున ఫిలిప్పీన్స్​ లోని విసాయాస్​ ప్రాంతంలోని సెబు నగరంలో రిక్టర్ స్కేల్​ పై 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది.  భూకంపం ధాటికి భవనాలు నేలమట్టం అయ్యాయి. సెబు ప్రావిన్స్​లో 22 మంది మృతి,37 మంది గాయపడినట్టు అధికారులు గుర్తించారు. ఈఏడాది ఫిలిప్పీన్స్​ లో అత్యంత విధ్వంసం సృష్టించిన భూకంపం ఇదే. భూకంపం ధాటికి పలు భవనాలు, వంతెనలు  కుప్పకూలాయి.

US జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం..ద్వీపం ఉత్తర చివరన బోగో సమీపంలో సెబు నగరంలో మంగళవారం రాత్రి 9.50 గంటలకు భూకంపం సంభవించింది. ఈ ప్రాంతంలో 90వేల మంది జనాభా కలిగిన నగరం.భూకంపం  ప్రకంపనలతో ఆ ప్రాంతమంతా ఊగిపోయింది. భూకంపం తర్వాత సునామీ ముప్పు లేదని పర్యవేక్షణ సంస్థ తెలిపింది.

భూకంప కేంద్రం బోగోకు ఈశాన్యంగా 17 కిలోమీటర్ల దూరంలో  కేంద్రీకృతమై ఉంది. సెబు ప్రావిన్స్‌లోని దాదాపు 90వేల మంది జనాభా కలిగిన తీరప్రాంత నగరం బోగో. ఇక్కడ 14 మంది మృతిచెందారని స్థానికులు ప్రకటించారు. 

బోగోలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పర్వత గ్రామంలోని గుడిసెలపై కొండచరియలు విరిగిపడ్డాయి. రాళ్లకింద ఉన్న మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ టీం చర్యలు చేపట్టాయి. 

శాన్ రెమిజియోలో ఆరుగురు మృతి

బోగోకు దక్షిణంగా ఉన్న శాన్ రెమిజియో పట్టణంలో చిన్నారితో సహా ఆరుగురు చనిపోయారు. భూకంపం వల్ల శాన్ రెమిజియో నీటి సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది.ఆహారం ,నీటి కోసం ప్రజలు అల్లాడిపోయారు. బోగోలో భూకంపం ధాటికి ఇళ్ల కాంక్రీట్ గోడలు, అగ్నిమాపక కేంద్రం ,కాంక్రీట్ ,తారు రోడ్లు ధ్వంసమయ్యాయి. 

ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్నిపర్వత శాస్త్రం ,భూకంప శాస్త్రం సునామీ హెచ్చరిక జారీ చేసింది. అలలు భారీ ఎత్తున ఎగిసి పడుతుండటంలో సెబులోని తీరప్రాంతాలకు సమీపంలోని లేట్ ,బిలిరాన్ ప్రావిన్సుల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.