భారత స్వాతంత్రోద్యమం బ్యాక్‌‌డ్రాప్‌‌లో 1920 భీమునిపట్నం

భారత స్వాతంత్రోద్యమం బ్యాక్‌‌డ్రాప్‌‌లో 1920 భీమునిపట్నం

1940లో ఒక గ్రామం,  కమలతో నా ప్రయాణం  వంటి అవార్డుల చిత్రాలను తెరకెక్కించిన నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్న తాజా  చిత్రం ‘1920 భీమునిపట్నం’.  భారత స్వాతంత్రోద్యమం బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో కంచర్ల ఉపేంద్ర హీరోగా నటిస్తున్నాడు.  కంచర్ల అచ్యుతరావు నిర్మాత. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించనున్నట్టు ప్రకటించారు. 

ఇది తన కెరీర్‌‌‌‌ను టర్న్ చేసే సినిమా అవుతుందన్నాడు  కంచర్ల ఉపేంద్ర. నరసింహ నంది మాట్లాడుతూ ‘1920– 22 మధ్య కాలంలో  స్వాతంత్ర్య  పోరాట నేపథ్యం  తీసుకుని అందులో కొన్ని ఊహాజనిత పాత్రలు, కొన్ని నిజ జీవితంలో జరిగిన పాత్రలు స్ఫూర్తిగా తీసుకుని కథను రాశా’ అని చెప్పారు.   నిర్మాత మాట్లాడుతూ ‘తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగలిగే కథ ఇది. ఈ చిత్రానికి ఇళయరాజా గారి  సంగీతం హైలైట్‌‌గా నిలుస్తుంది’ అని చెప్పారు.