తెలంగాణలో 1,933 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో 1,933 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,32,996 నమూనాలను పరీక్షించగా 1,933 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కరోనా వారిన సోకిన సంఖ్య 5,93,103కి చేరింది. GHMC పరిధిలో 165 యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. ఇందులో ఇవాళ(సోమవారం) 16 మంది  చనిపోగా ..ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,394కి పెరిగింది. 3,527 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25,406 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది.