
భారత్, జింబాబ్వే మధ్య వన్డే సిరీస్ కొనసాగుతోంది. హరారేలో జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వేను భారత బౌలర్లు కట్టడి చేశారు. బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ కట్టారు. బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న పిచ్ పై భారత బౌలర్లు రెచ్చిపోయారు. కేవలం 40.3 ఓవర్లలో జింబాబ్వే జట్టు 189 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జింబాబ్వే జట్టులో కెప్టెన్ రెగిస్ చకబ్వా (35), బ్రాడ్ ఇవాన్స్ (33 నాటౌట్) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.
తొలుత టాస్ గెలిచిన టీమిండియా మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్ కు సహకరిస్తుందనే అంచనాతో ఫీల్డింగ్ తీసుకోవడం జరిగిందని కెప్టెన్ రాహుల్ వెల్లడించాడు. అతను చెప్పినట్లుగానే బౌలర్లకు పిచ్ సహకరించింది. కేవలం 27 ఓవర్లలో 107 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లలో దీపక్ చహార్, ప్రసిద్ కృష్ణ, అక్షర్ పటేల్ చెలరేగిపోయారు. వీరు చెరో మూడు వికెట్లు తీశారు. సిరాజ్ ఒక వికెట్ తీశారు.
జింబాబ్వే టీమ్ : మరుమని, ఇన్నోసెంట్ కైయా, సీన్ విలియమ్స్, వెస్లే మధెవెరె, రెగిస్ చకబ్వా (కెప్టెన్), రైన్ బర్ల్, లూక్ జాన్ గ్వే, బ్రాడ్ ఇవాన్స్, విక్టర్ నైచి, రిచర్డ్ ఎన్ గర్వావ
భారత జట్టు : శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, కుల్ దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, సిరాజ్.