టన్నెల్ ఆపరేషన్ : 10 రోజుల తర్వాత 40 మంది ఇలా ఉన్నారు.. పైప్ ద్వారా లోపలికి కెమెరా

టన్నెల్ ఆపరేషన్ : 10 రోజుల తర్వాత 40 మంది ఇలా ఉన్నారు.. పైప్ ద్వారా లోపలికి కెమెరా

టన్నెల్ లో కార్మికులు చిక్కుకుని 10రోజులవుతోంది. దీంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. వాళ్లు బాగానే ఉన్నారని, పైప్ లైన్ ద్వారా ఫుడ్ పంపిస్తున్నామని చెబుతూ.. వాళ్లెలా ఉన్నారోన్న ఆందోళన మాత్రం వారి కుటుంబాలను నిద్రపోనివ్వడం లేదు. తాజాగా ఈ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన ఓ వీడియోను అధికారులు రిలీజ్ చేశారు.

10 రోజుల పాటు ఉత్తర కాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మొదటి వీడియోను రెస్క్యూ అధికారులు విడుదల చేశారు. ప్రత్యామ్నాయ 6-అంగుళాల ఫుడ్ పైప్‌లైన్ ద్వారా పంపబడిన ఎండోస్కోపిక్ కెమెరాను ఉపయోగించి విజువల్స్ ను క్యాప్చర్ చేశారు. ఈ వీడియోలో, కార్మికులు, పసుపు, తెలుపు హెల్మెట్‌లు ధరించి, పైప్‌లైన్ ద్వారా వారికి ఆహార పదార్థాలను పంపడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కనిపిస్తుంది. దీంతో కార్మికుల కుటుంబాలకు పెద్ద ఊరట లభించింది.

ఈ విషయంపై స్పందించిన నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఐడిసిఎల్) డైరెక్టర్ అన్షు మనీష్ ఖల్ఖో.. కార్మికులు ఎలా ఉన్నారో చూడడానికి పైప్‌లైన్ ద్వారా కెమెరాలను చొప్పించనున్నట్లు ఇంతకుమునుపే చెప్పారు. నవంబర్ 20న సాయంత్రం ఢిల్లీ నుంచి కెమెరా రావడంతో దాన్ని లోపలికి పంపారు.