ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సి వస్తోంది: చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సి వస్తోంది: చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

ఢిల్లీలో రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. కాలుష్యం ఎంత పెరిగిపోతుందంటే.. ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‎పై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కాలుష్య నివారణకు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు.

కాగా.. కాలుష్య పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండటం పట్ల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి కాలుష్య పరిస్థితుల్లో ప్రజలు ఎలా బతుకుతారు అని ఎన్వీ రమణ ప్రశ్నించారు. ప్రభుత్వాలు.. రాజకీయాలను పక్కన పెట్టి ఈ విషయంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. కాలుష్య నివారణకు తక్షణం చర్యలు చేపట్టాలని.. అవసరమైతే రెండు రోజుల పాటు ఢిల్లీలో లాక్‎డౌన్ విధించే అంశాన్ని కూడా పరిశీలించాలి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.