మంకీ ఫీవర్ కలకలం..కర్ణాటకలో ఇద్దరు మృతి

మంకీ ఫీవర్ కలకలం..కర్ణాటకలో ఇద్దరు మృతి

 కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది.  ఈ వ్యాధి బారిన పడిన  ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  ప్రాణాలు కోల్పోయారు.    ఈ  ఫీవర్ తో చనిపోయిన ఇద్దరిలో ఒకరు శివమొగ్గ జిల్లాలోని హోసానగర్ కు చెందిన  యువతి కాగా.. మరో వ్యక్తి ఉడిపి జిల్లాలోని మణిపాల్ లో 79 ఏళ్ల వ్యక్తి మరణించారని  కర్ణాటక హెల్త్ డిపార్ట్ మెంట్  వెల్లడించింది.
 
ఇప్పటివరకు కర్ణాటకలో   49 మంకీ ఫీవర్  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఉత్తర కన్నడ జిల్లాలో గరిష్టంగా 34 కేసులు నమోదయ్యాయి,తర్వాత శివమొగ్గలో 12 కేసులు నమోదయ్యాయి.  మిగిలిన మూడు చిక్కమగళూరు జిల్లాలో నమోదయ్యాయి.

 వెంటనే అలర్ట్ అయిన కర్ణాటక ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ కమిషనర్ రణదీప్  శివమొగ్గ, చిక్కమగళూరు జిల్లాల ఆరోగ్య అధికారులతో సమావేశమయ్యారు. ప్రజలను అప్రమత్తం చేయాలంటూ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.   ఇప్పటి వరకు  జనవరి 1 నుంచి కేఎఫ్ డీ కేసులు నమోదైన ప్రాంతాల నుంచి  2288 శాంపిల్స్ సేకరించగా వాటిలో 49 కేసులు పాజిటివ్ వచ్చాయని వెల్లడించారు

మంకీ ఫీవర్ ను క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD)గా పిలుస్తారు. కోతులపై ఉండే పేలు కుట్టడం వల్ల ఈ జ్వరం వ్యాపిస్తుంది. కోతుల్లో ఉండే పేలుమనుషుల్ని కుట్టడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఫీవర్ వచ్చిన వారికి మూడు నుంచి ఐదు రోజుల పాటు తీవ్ర జ్వరం..ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జలుబు,దగ్గు ఉంటాయి.