
జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎన్ కౌంటర్ జరిగింది.. శనివారం (ఆగస్టు9) ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మద్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. మరో నలుగురు గాయపడినట్లు ఆర్మీలు తెలిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్లుబెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఓ ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఆపరేషన్ అఖల్
జమ్మూకాశ్మీర్ లోని కుల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు చెక్ పెట్టే లక్ష్యంతో ఆగస్టు 1న భద్రతా దళాలు ఆపరేషన్ అఖల్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. నిర్దిష్ట నిఘా వర్గాల సమాచారం మేరకు భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు .సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంయుక్తంగా భారీ కార్డన్ ,సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
గత శుక్రవారం ఇరు వర్గాల మధ్య ప్రారంభ కాల్పుల తర్వాత రాత్రిపూట ఆపరేషన్ నిలిపివేశారు.అయితే భద్రతా దళాలు ఆ ప్రాంతానికి అదనపు దళాలను మోహరించడం ద్వారా మళ్ళీ ప్రారంభించడంతో తరువాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.
►ALSO READ | చైనాలో ఆకస్మిక వరదలు
జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద చరిత్రలో ఇది అత్యంత సుదీర్ఘమైన ఆపరేషన్లలో ఒకటి..ఉగ్రవాద వ్యతిరేక డ్రైవ్‌లో ఇప్పటివరకు 13 మంది సైనికులు గాయపడ్డారు. దట్టమైన ఆకులు, గుహలు ,బండరాళ్లతో కప్పబడిన ఈ ప్రాంతం ఉగ్రవాదులకు ప్రధాన రహస్య స్థావరాలుగా ఉండటంతో ఆర్మీ అనేక సవాళ్లను ఎదురుకుంటోంది. అదనంగా ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు మరిన్ని అడ్డంకులను సృష్టిస్తున్నాయి.