ఈ దుర్యోధ‌న‌.. దుశ్సాన ప‌ర్వంలో.. కూర‌గాయ‌ల మార్కెట్ లో.. మ‌హిళ‌ల బ‌ట్ట‌లు ఊడ‌దీశారు..

ఈ దుర్యోధ‌న‌.. దుశ్సాన ప‌ర్వంలో.. కూర‌గాయ‌ల మార్కెట్ లో.. మ‌హిళ‌ల బ‌ట్ట‌లు ఊడ‌దీశారు..

పశ్చిమ బెంగాల్: మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానుష ఘటన మరువకముందే పశ్చిమ బెంగాల్ లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. మాల్దా జిల్లాలోని పకుహత్  ప్రాంతంలో పట్టపగలు ఇద్దరు మహిళలను బట్టలు ఊడదీసి కొందరు అమానుష దాడికి పాల్పడ్డారు. దొంగతనం చేశారని నెపంతో ఓ గుంపు ఇద్దరు మహిళలపై చీరలు చించి చెప్పులతో దాడి చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి: బెంగాల్ బీజేపీ 
పశ్చిమ బెంగాల్ బిజెపి చీఫ్ డాక్టర్ సుకాంత మజుందార్ ట్విట్టర్ లో ఈ వీడియోను షేర్ చేశారు. మాల్దాలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రను చేసి, నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ఇది హేయమైన చర్య.. ఇలాంటి హేయమైన చర్యలను సహించకూడదు. దీనిపై బెంగాల్ ప్రభుత్వం, ప్రతిపక్ష కూటమిని స్పందించకపోవడం దారుణమని ట్వీట్ చేశారు. వేధింపులకు గురైన ఇద్దరు మహిళలు మాణిక్‌చక్‌ వాసులుగా స్థానిక వర్గాలు గుర్తించాయి. ఆశ్చర్యకరంగా, వారు క్రూరత్వాన్ని భరించినప్పటికీ, ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదు.

Another horrific incident with the Tribal women in WB.

Two Tribal women were stripped naked & beaten mercilessly in Malda.

Like other heinous incidents, Didi is silent & not taking any action in her own rule.

Why I.N.D.I.A. isn’t condemning this?

pic.twitter.com/3liCO5bNIY

— Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) July 22, 2023