
ఎక్కణ్నుంచి తెస్తున్నారో ఏమో కానీ క్వింటాళ్ల కొద్ది గంజాయి పట్టుబడుతూనే ఉంది. మంగళవారం (అక్టోబర్ 07) సూర్యాపేట జిల్లాలో క్వింటా 20 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. దీని విలువ 60 లక్షల రూపాయలకు పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు.
జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ నరసింహా తెలిపారు. ముగ్గురు నిందితులు అరెస్ట్ చేయగా, అందులో ఒకరు మహిళ ఉన్నట్లు చెప్పారు. నిందితుల నుంచి కారు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీన్నట్లు చెప్పారు. గంజాయి ఎక్కణ్నుంచి తెస్తున్నదీ.. ఈ ముఠా వెనుక ఎవరెవరున్నారో త్వరలోనే బయటపెట్టనున్నట్లు తెలిపారు.
►ALSO READ | ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలుడు మృతి