
గంట తరువాత వరుణ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు.
ఆర్ఎంపీ వైద్యం వికటించడంతోనే తమ కొడుకు చనిపోయాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు లింగంపేటలోని ఆర్ఎంపీ ఇంటి ముందు డెడ్‌బాడీతో ఆందోళనకు దిగారు. బాలుడిపేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఆయుర్వేద వైద్యంతో మరొకరు..
ఖిల్లాగణపురం:- మండలంలోని మామిడిమాడ గ్రామానికి చెందిన అనేమోని రాములు(28) కొన్నాళ్లుగా అప్పారెడ్డిపల్లిలో ఉన్న తన అక్క ఇంటి వద్ద ఉంటున్నాడు. రెండ్రోజులుగా అనారోగ్యానికి గురి కావడంతో సోమవారం మండలకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆయుర్వేద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయించగా తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. ఆయుర్వేద వైద్యంతోనే తన భర్త చనిపోయాడని భార్య రాజేశ్వరి వాపోయింది.