సిరియా జవాన్ల బస్సుపై టెర్రర్ అటాక్ 20 మంది మృతి..

సిరియా జవాన్ల బస్సుపై టెర్రర్ అటాక్ 20 మంది మృతి..

బేరూట్: లెబనాన్ రాజధాని బేరూట్​లో గురువారం రాత్రి ఘోరం జరిగింది. సిరియా సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై టెర్రరిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో 20 మంది జవాన్లు చనిపోయారు. మరో 10 మంది గాయపడ్డారు. ఇరాక్‌‌ సరిహద్దు ప్రాంతమైన డీర్ ఎల్-జోర్ ప్రావిన్స్‌‌లోని మయాదీన్ ఏరియాలో ఈ దాడి జరిగిందని బ్రిటన్‌‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ శుక్రవారం వెల్లడించింది. జిహాదీలు బస్సును చుట్టుముట్టి కాల్పులు జరిపిన తర్వాత డజన్ల కొద్దీ సైనికులు కనిపించకుండా పోయారని పేర్కొంది. ఐఎస్ కు చెందిన స్లీపర్ సెల్స్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఐసీస్ ఆధీనం నుంచి 2017లో ఇరాన్, 2019లో సిరియా బయటపడ్డాయి. అయినప్పటికీ సిరియాలోని స్లీపర్ సెల్స్ ఇప్పటికీ ఘోరమైన దాడులకు పాల్పడుతూనే ఉన్నారు.