20 లక్షలు దాటిన కరోనా కేసులు

20 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది.  ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల 65 కు చేరింది. ఇందులో 1,26,754 మంది చనిపోగా..4,84,597 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అత్యధికంగా అమెరికాలో  6,14,246 కరోనా కేసులు నమోదవ్వగా..26,064 మంది చనిపోయారు. అమెరికా తర్వాత అత్యధికంగా స్పెయిన్లో 1,74,060 , ఇటలీ 1,62,488 , ఫ్రాన్స్ 1,43,303 ,జెర్మనీ 1,32,210, యూకేలో 93,873, చైనా 82,295 ఇరాన్ లో 74,877 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనాతో అత్యధికంగా అమెరికాలో  26064 మంది చనిపోగా.. ఆ తర్వాత ఇటలీలో 21067 మంది, స్పెయిన్ లో 18255, ఫ్రాన్స్ లో 15729, ఇరాన్ లో 4683, బెల్జీలియంలో 4157 ,జెర్మనీలో 3495 ,చైనాలో 3342 మంది  కరోనాతో చనిపోయారు.  ఇక ఇండియాలో 11487 కరోనా కేసులు నమోదవ్వగా..394 మంది చనిపోయారు.