ప్రమాదంలో దాదాపు 20 లక్షల జాబ్స్

ప్రమాదంలో దాదాపు 20 లక్షల జాబ్స్

జాబ్‌ పోతే ఆదుకోండి!
ఇంగ్లండ్‌ విధానం అమలు చేయండి
వారికి బేసిక్‌ శాలరీ ఇవ్వండి
పీఎఫ్‌ చందా కూడా మీరే కట్టండి
ప్రభుత్వానికి నాస్కామ్‌ రిక్వెస్ట్‌‌

బెంగళూరు: కరోనా, ఆర్థికమాంద్యంతో జాబ్స్‌‌ కోల్పోయే బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌‌మెంట్‌ (బీపీఎం), గ్లోబల్‌ ఇన్‌‌హౌజ్‌ సెంటర్స్ (జీఐఎస్‌)
వారిని ఆదుకోవాలని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్‌‌ చేసింది. బెంచ్‌పై ఉన్న వారికి కనీస వేతనంతోపాటు పీఎఫ్‌ వంటివి
అయినా ఇవ్వాలని సూచించింది. ఇలాంటి ఉద్యోగుల కోసం ఇంగ్లండ్‌ తరహా విధానాన్ని అమలు చేయాలని కోరింది. లాక్‌‌డౌన్‌‌వంటి కష్టకాలంలో అక్కడ జాబ్‌‌పోయిన ఎంప్లాయి కంపెనీలోనే ఉంటాడు కానీ జీతం ఇవ్వరు. దీనిని ఫార్లోస్కీమ్‌ అంటారు. ఈ విధానంలో ఉద్యోగం కోల్పోయిన
వారికి ప్రభుత్వం 50 శాతం జీతం ఇస్తుంది. ఈ కష్టకాలంలో కొన్ని రకాల కంపెనీల, వాటి ఉద్యోగుల పీఎఫ్‌ చందాలను ప్రభుత్వమే చెల్లించాలని
కూడా కోరామని నాస్కామ్‌ తెలిపింది. లాక్‌‌డౌన్‌‌ ఎత్తేశాక, మరింత మంది ఉద్యోగాలు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ‘‘ఐటీ
ఇండస్ట్రీలో బీపీఎం/జీఐసీ జాబ్స్‌‌వాటాయే 70 శాతం వరకు ఉంటుంది. వీరిలో కనీసం 20 శాతంమంది ఇంట్లోనే ఖాళీగా ఉన్నారని అనుకున్నా, ఇది చాలా పెద్దసంఖ్య. జీతాల మొత్తం చాలా ఎక్కువ ఉంటుంది. ఐటీ/బీపీఎంలో దాదాపు 40 లక్షల మంది పనిచేస్తున్నారు’’ అని నాస్కామ్‌ వివరించింది. ఒక్క బీపీఎం ఇండస్ట్రీలోనే పది లక్షల మంది పనిచేస్తున్నారు. వీరంతా ఫైనాన్స్‌‌, అకౌంటింగ్ పేరోల్‌, ప్రొక్యూర్‌‌మెంట్‌, హెచ్‌ఆర్‌‌, సప్లైచెయిన్స్‌‌, లీగల్‌, ఇతర సర్వీసుల్లో పనిచేస్తున్నారు. చాలా జీఐసీలు ఇలాంటి సేవలను తమ పేరెంట్‌ కంపెనీలకూ, కస్టమర్లకూ అందజేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు తీవ్ర నష్టాల పాలవుతున్నాయి కాబట్టి ఇలాంటి సేవలకు డిమాండ్‌ ఉండదు. నాస్కామ్‌ లెక్కల ప్రకారం దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. వీరందరి బేసిక్ శాలరీ రూ.12 వేల వరకు ఉంటుంది. ఫార్లో ప్యాకేజీ అమలు
చేస్తే ప్రభుత్వం దాదాపు రూ.480 కోట్లను బేసిక్‌‌ సాలరీ, పీఎఫ్‌ కోసం ఇవ్వాల్సి ఉంటుంది.

For More News..

గోల్డ్‌కు డిమాండ్‌ తగ్గుతుందా?

కరోనాను అడ్డుకోవడంలో వరల్డ్‌ లీడర్‌‌షిప్‌ ఫెయిల్

కరోనా చెత్తను ఎలా పడేయాలో తెలుసా..

టైంపాసుకు రోడ్డెక్కితే.. పట్టేస్తది