మంబోజిపల్లిలో 20 లీటర్ల మద్యం సీజ్ : ఎస్ఐ లింగం

మంబోజిపల్లిలో  20 లీటర్ల  మద్యం సీజ్ : ఎస్ఐ లింగం

మెదక్​టౌన్, వెలుగు: అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పట్టుకొని మద్యాన్ని సీజ్​ చేసినట్లు ఎస్ఐ లింగం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్​ మండలంలోని మంబోజిపల్లిలో ఆదివారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో  పాపన్నపేట మండలం నాగ్సాన్​పల్లికి చెందిన జోగేలి సూర్యసింహ అనుమానాస్పదంగా సంచరిస్తుండగా గమనించిన ఏఎస్ఐ దయానంద్​ అదుపులోకి తీసుకొని విచారించారు. 

మెదక్ పట్టణంలోని వైన్ షాపులో మద్యం కొనుగోలు చేసి నాగ్సాన్​పల్లిలో అధిక ధరకు అమ్మడానికి ఆటో గురించి వేచి చూస్తున్నట్లు తెలిపారు. దీంతో అక్రమంగా తరలిస్తున్న 20 లీటర్ల మద్యాన్ని సీజ్​ చేయడంతో పాటు సూర్యసింహపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.