
మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో ములుగు జిల్లాలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. జిల్లా ఎస్పీ శబరిష్ ముందు 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. చత్తీస్ గడ్, తెలంగాణ కేడర్ కు చెందిన 20 మంది మావోయిస్టుల అరెస్ట్ అయ్యారు. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులు పలు హోదాలో పనిచేస్తున్నారు. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి సుముఖతచూపుతున్నారు.
తక్షణ సాయంగా ఒక్కొరికి రూ. 25 వేల చొప్పున నగదు అందజేశారు. లొంగిపోయిన మావోయిస్టుల మీద ఉన్న రివార్డులు 24 గంటల్లో వారు ఎకౌంట్లో జమ చేస్తున్నామని జిల్లా ఎస్పీ శబరిష్ చెప్పారు. వారికి పునరావాసం కల్పించి అన్ని విధాల ఆదుకుంటామన్నారు. వారి ఆరోగ్య సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు.
►ALSO READ | ఖమ్మం జిల్లా, రాష్ట్రాల సరిహద్దులో ఏడు చెక్ పోస్టులు : ఖమ్మం సీపీ సునీల్ దత్
చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఇటీవల చేపట్టిన ఆపరేషన్ కగార్ ఏప్రిల్ 21 నుంచి మే 11 వరకు జరిపిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో 31 మంది మావోయిస్టులు చనిపోగా, అందులో 17 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరిపై మొత్తం రూ.1.72 కోట్ల రివార్డు ఉంది