ఖమ్మం జిల్లా, రాష్ట్రాల సరిహద్దులో ఏడు చెక్ పోస్టులు : ఖమ్మం సీపీ సునీల్ దత్

ఖమ్మం జిల్లా, రాష్ట్రాల సరిహద్దులో ఏడు చెక్ పోస్టులు : ఖమ్మం సీపీ సునీల్ దత్

ఖమ్మం టౌన్, వెలుగు :  పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని జిల్లా, రాష్ట్రాల సరిహద్దులో ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. శుక్రవారం పోలీస్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేక చెక్ పోస్టుల్లో పోలీసు, పశుసంవర్ధక శాఖ సిబ్బందితో షిఫ్ట్ ల వారీగా నిరంతరం పనిచేస్తాయని తెలిపారు. పశువులను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

  పండుగల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా మత సామరస్యానికి భంగం కలిగించేలా విద్వేషాలు, రెచ్చగొట్టే, అసభ్యకర పోస్టులు పెడితే చర్యలు తీసుకునేందుకు మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.