ఆసిఫాబాద్ జిల్లాలో 20 తులాల గోల్డ్ చోరీ

ఆసిఫాబాద్ జిల్లాలో 20 తులాల గోల్డ్ చోరీ

ఆసిఫాబాద్, వెలుగు: ఇంట్లో దొంగలు పడి భారీగా బంగారం ఎత్తుకెళ్లిన ఘటన ఆసిఫాబాద్​జిల్లా కేంద్రంలో జరిగింది. బాధిత కుటుంబం తెలిపిన ప్రకారం.. రాజంపేట కాలనీలో ఉండే బీరెల్లి సురేశ్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం గోదావరిఖనిలోని సుందిళ్ల ఆలయ దర్శనానికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటికి తిరిగొచ్చి చూడగా బీరువా పగలగొట్టి ఉంది. 

సామాను చిందరవందరగా పడవేసి ఉండడంతో పాటు 20 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ బాలాజీ వరప్రసాద్ వెళ్లి ఇంటిని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో పాటు డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ తనిఖీలు చేపట్టినట్టు ఎస్ ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు.