
వడోదర: తమఅదుపులో ఉన్న 200 మంది భారతీయ జాలర్లను పాకిస్తాన్ విడుదల చేసింది. వీరంతా పంజాబ్ నుంచి ప్రత్యేక రైలులో గుజరాత్‌కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం వడోదరకు చేరుకున్న వీరికి అధికారులు, కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. కాగా, పాక్తీర ప్రాంత దళాలు భారత జాలర్లను 2019 నుంచి 2022 మధ్య అదుపులోకి తీసుకున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుదాటి పాక్ జలాల్లోకి ప్రవేశించారని వీరిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో గతవారం 200మంది జాలర్లను పాకిస్తాన్ విడుదల చేసింది. వీరిని అమృత్‌సర్‌లోని వాఘా సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించింది. జాలర్లను వారి స్థానిక ప్రాంతాలకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు.