
ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రలో రెండు వందల మంది యాత్రికులు మరణించారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. అత్యధిక మరణాలు కేదార్‌నాథ్ (96) మార్గంలో నమోదయ్యాయి. యమునోత్రి ధామ్‌లో 34, బద్రీనాథ్ ధామ్‌లో 33, గంగోత్రి ధామ్‌లో 29, హేమకుండ్ సాహిబ్‌లో ఏడుగురు, గౌముఖ్ ట్రెక్‌లో ఒకరు మరణించారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఏడాది సెప్టెంబర్ 11 వరకు 232 మంది యాత్రికులు మరణించారు. కేదార్‌నాథ్ ధామ్‌లో 111 మంది, బద్రీనాథ్ ధామ్‌లో 58 మంది, హేమకుండ్ సాహిబ్‌లో నలుగురు, గంగోత్రి ధామ్‌లో 15 మంది, యమునోత్రి ధామ్‌లో 44 మంది చనిపోయారు. మరణాలు ప్రధానంగా ఆరోగ్య సమస్యలు, బండరాయి పడిపోవడం వల్ల సంభవించాయి.
ఈ ఏడాది ఇప్పటి వరకు చార్‌ధామ్ యాత్రకు సుమారు 42 లక్షల మంది, ప్రధానంగా కేదార్‌నాథ్ ధామ్‌కు 13.4 లక్షల మంది యాత్రికులు పొటెత్తినట్లు వెల్లడించారు. కాగా గతేడాది యాత్రలో 300 మందిపైగా యాత్రికులు చనిపోయారు.