అప్పుడు విరాళం.. ఇప్పుడు వసూళ్లు: నిర్మాత బన్నీ వాసు

అప్పుడు విరాళం.. ఇప్పుడు వసూళ్లు: నిర్మాత బన్నీ వాసు

"2018లో కేరళను వరదలు ముంచెత్తిన సమయంలో అక్కడ గీత గోవిందం సినిమాను రిలీజ్ చేసాం. ఈ సినిమాకు వచ్చిన వసూళ్లను.. అక్కడి వరద బాధితుల కోసం విరాళంగా ఇచ్చాం. అందుకేనేమో మలయాళ ఇండస్ట్రీ హిట్‌ మూవీ ‘2018’ ని తెలుగులో రిలీజ్ చేసే అవకాశం నాకు వచ్చింది. ఇంతమంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్‌ వేణు, ఆంథోనీ, పద్మ కుమార్‌గార్లకు థ్యాంక్స్‌" అని చెప్పుకొచ్చారు టాలీవుడ్ నిర్మాత ‘బన్నీ’ వాసు. 

టోవినో థామస్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో వచ్చిన మలయాళ చిత్రం ‘2018’. జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఈ నెల 3న రిలీజై అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా వచ్చిన రెస్పాన్స్ చూసి నిర్మాత బన్నీ వాసు 2018 మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో కూడా ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 

దీంతో..  హైదరాబాద్‌లో ‘2018’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్కు 2018 హీరో టోవినో థామస్‌ తో పాటు చిత్ర యూనిట్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో వినో థామస్‌ మాట్లాడుతూ–‘‘ఇకపై నేను నటించే సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తాను, ఈ సినిమాకి ఇంత ప్రేమను అందించిన తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చాడు.