బెన్ స్టోక్స్ అనూహ్య నిర్ణయం

బెన్ స్టోక్స్ అనూహ్య నిర్ణయం
  • వన్డేలకు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై చెప్పిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్
  • 2019 వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోగా ఖ్యాతి
  • నేడు సౌతాఫ్రికాతో జరిగే వన్డేతో వీడ్కోలు

లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2019 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరో బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పలుకుతున్నట్టు సోమవారం ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. 31 ఏళ్ల  స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మూడు ఫార్మాట్లలో నిలకడగా ఆడలేననే వన్డేలకు వీడ్కోలు చెబుతున్నానని తెలిపాడు. మంగళవారం తన హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన డర్హమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికాతో జరిగే వన్డే మ్యాచ్​ ఆడి ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పుకుంటున్నాడు. ‘ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టు తరఫున నా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  కలిసి ఆడిన ప్రతీ క్షణాన్ని ఎంతో ఆస్వాదించా. ఇప్పుడు ఈ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని డిసైడయ్యా. ఇది చాలా కఠినమైన నిర్ణయం. కానీ, ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేను నా వంద శాతం ఇవ్వలేనన్న వాస్తవం తెలిసి  కూడా కొనసాగలేను’ అని స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పాడు.  2011లో ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తొలి వన్డే ఆడిన స్టోక్స్  ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్లలో ఒకడిగా ఎదిగాడు. ఇప్పటిదాకా 104 వన్డేలు ఆడిన స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2919 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించి 74 వికెట్లు పడగొట్టాడు. గత వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలవడం అతని కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిరస్మరణీయ సందర్భం. ఆ టోర్నీలో అద్భుతంగా ఆడిన స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌండ్రీ కౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారంగా విజేతగా నిలిచిన ఫైనల్లో 84  రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కీలక పాత్ర పోషించాడు. జో రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఈ మధ్యే ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్టు కెప్టెన్సీ అందుకున్న  స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయం అందించాడు. అలాగే, ఇండియాతో ఐదో టెస్టులో గెలవడంతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డ్రా చేసుకుంది.