2020 ‘దాదాసాహెబ్ ఫాల్కే’ సౌత్ అవార్డులు

V6 Velugu Posted on Jan 03, 2021

న్యూ ఇయర్ పురస్కరించుకొని 2020 ఏడాదికిగాను దాదా సాహెబ్‌ ఫాల్కే సౌత్‌ అవార్డుల జాబితాను ప్రకటించారు. సౌత్‌లోని నాలుగు …తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమ రంగాలు అవార్డులు అందుకున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్‌కు సంబంధించిన ఆరు కెటగిరిల్లో అవార్డులు వరించాయి. యువ నటుడు నవీన్ పోలిశెట్టి సౌత్ కేటగిరీలో బెస్ట్ యాక్ట‌ర్ అవార్డును దక్కించుకున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీకిగాను న‌వీన్‌కు ఈ అవార్డు ద‌క్కింది. ఇక బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించిన నాని ‘జెర్సీ’ సౌత్ కేట‌గిరీలో బెస్ట్ మూవీగా ఎంపికైంది. ఉత్త‌మ న‌టిగా ర‌ష్మిక మందానా ఎంపికైంది. ‘డియ‌ర్ కామ్రేడ్’ సినిమాలో న‌ట‌న‌కుగాను ఆమెకు ఈ అవార్డు దక్కించుకుంది. భారీ బ‌డ్జెట్‌తో ‘సాహో ‘మూవీని తెర‌కెక్కించిన సుజీత్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ‘అల వైకుంఠ‌పురములో ‘ వంటి మ్యూజిక‌ల్ హిట్‌తో అభిమానులను అల‌రించిన థ‌మ‌న్‌.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవార్డు అందుకోనున్నాడు. ఇక మోస్ట్ వ‌ర్స‌టైల్ యాక్ట‌ర్ అవార్డు అక్కినేని నాగార్జున‌కు ద‌క్కింది.

Tagged South Awards

Latest Videos

Subscribe Now

More News