
2023 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం మొదలుకానుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే 2023లో కూడా పెద్ద, చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపించాయి కానీ.. అందులో చిన్న సినిమాల డామినేషన్ క్లియర్ గా కనిపించింది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన చాలా సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. మరి అలా వండర్స్ క్రియేట్ చేసిన చిన్న సినిమా డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
1.బలగం.. జబర్దస్త్ షోలో కమెడియన్ గా పరిచయమైనా వేణు ఎల్దండి(వేణు వండర్స్) ఈ సినిమా తెరకెక్కించడం విశేషం. కేవలం కథా బలంతో వచ్చిన బలగం మూవీ ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టించింది. హ్యూమన్ ఎమోషన్స్ బ్యాక్డ్రాప్తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. కేవలం రూ.3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా.. రూ.25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. జాతీయ అంతర్జాతీయ వేదికల్లో ఎన్నో అవార్డులు గెలుచుకుంది ఈ మూవీ.
2.విరూపాక్ష.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రిలీజ్ కు ముందు పెద్దగా అంచనాలు లేని ఈ సినిమా.. ప్రేక్షకులను భయపెట్టడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. కొత్త దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సాయి ధరమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
3.బేబీ.. దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య,విరాజ్ అశ్విన్ జంటగా వచ్చిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన బేబీ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర రూ.91 కోట్లు కలెక్ట్ చేసిన రికార్డ్ క్రియేట్ చేసింది.
4.సామజవరగమన.. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ సామజవరగమన. కొత్త దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను ఫుల్లుగా నవ్వించింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.44 కోట్ల కలెక్ట్ చేసి శ్రీవిష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
5.బెదురులంక 2012.. RX100 ఫేమ్ కార్తికేయ గుమ్మికొండ నటించిన లేటెస్ట్ కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ బెదురులంక 2012. కొత్త దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం చూస్తున్న కార్తికేయకు ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది.
6.మంగళవారం.. RX100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మంగళవారం. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ వెన్నులో వణుకుపుట్టించింది. సరికొత్త స్క్రీన్ ప్లేతో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.
7.పొలిమేర2.. చేతబడులు కాన్సెప్ట్ లో దర్శకుడు అనిల్ విశ్వనాధ్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ పొలిమేర2. 2021లో వచ్చి సూపర్ హిట్ అయిన పొలిమేర సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. సరికొత్త కథా కథనాలతో ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని పంచింది ఈ మూవీ.
8.మ్యాడ్.. చాలా కాలం తరువాత కాలేజ్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ను ఫుల్లుగా నవ్వించింది. కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అంతా కొత్తవాళ్లతో వచ్చిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించి మంచి కలెక్షన్స్ రాబట్టింది.