2024 మోడల్ హుందాయ్ క్రెటా కార్లు వచ్చేశాయ్.. ధర ఎంతంటే..!

2024 మోడల్ హుందాయ్ క్రెటా కార్లు వచ్చేశాయ్.. ధర ఎంతంటే..!

ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రెటా ఫేస్ లిఫ్ట్ ను హుందాయ్ కంపెనీ ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. మోడిఫై చేసిన కొత్త మోడల్ హుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ ను ఆధీకృత డీలర్ల నుంచి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. 

2024 హుందాయ్ క్రెటి ఫేస్ లిఫ్ట్ అప్ డేట్ లు ఇవే.. 

2024 హుందాయ్ క్రెటి ఫేస్ లిఫ్ట్ టన్నుల కొద్ది కాస్మెటిక్ మార్పులతో వస్తోంది. పాత మోడల్ కంటే మరింత స్ట్రైలీష్ గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. లోపల, బయట కొన్ని గుర్తించ దగిన మార్పులు చేశారు. ఫ్రంట్ ఫాసియా, కొత్త గ్రిల్స్, hs10 కంటే ఎక్కువ శక్తివంతమైన సెక్యురిటీ ఫీచర్స్ తో సహా కొన్ని ట్రెండింగ్ లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. 

  • టక్సన్ మోడల్ ఫ్రంట్ ప్రొఫైల్ 
  • LED  హెడ్ లైట్ సెటప్, L షేప్ LED DRLలు
  • ముందు భాగంలో భారీ స్కిడ్ ప్లేట్, గ్రిల్పై కంపెనీ లోగో 
  • మంచి పొడవు, వెడల్పు,2,610 mm వీల్ బేస్ 

అంతర్గత అప్ డేట్స్.. 

2024 మోడల్ హుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ లో ఇంటీరియర్ డిజైన్ చాలా మార్పులు చేశారు. అవి.

  • కొత్తగా 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ డిస్ ప్లే ఉంటుంది. 
  • Apple, Android, Auto Car Playతో సహా అన్ని వైర్ లెస్ కార్ కనెక్ట్ టెక్నాలజీలకు సపోర్ట్ 
  • మోడిఫై చేసిన డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది 
  • ఫ్యుయెల్, స్పీడ్, RPM, మైలేజ్ వంటి డ్రైవర్లకు అవసరమైన సమాచారాన్ని ట్రాక్ చేయడానికి ఇన్ఫోటైన్ మెంట్ డిస్ ప్లే సహకరిస్తుంది 

ప్రీమియం క్లాస్ క్యాబిన్:

డ్యుయెల్ జోన్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్(DATC) కోసం నియంత్రించేందుకు కొత్త సెంటర్ కన్సోల్ డిజైన్ ఉంటుంది. 

హుందాయ్ క్రెటాను ఐదు పవర్ ట్రైన్ ఆప్షన్లను పరిచయం చేస్తుంది

  • 1.5 లీటర్ MPi పెట్రోల్ ఇంజిన్ (లేటెస్ట్ ) 
  • 1.5 లీటర్ CRDi  డీజిల్ ఇంజిన్ (లేటెస్ట్ ) 
  • 1.5 లీటర్ టర్బో GDI పెట్రోల్ యూనిట్ (లేటెస్ట్)

 Hyundai Creta Facelift   ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు