2025 Chavithi Special: వినాయక చవితికి థియేటర్లో చిన్న సినిమాల సందడి

2025 Chavithi Special: వినాయక చవితికి థియేటర్లో చిన్న సినిమాల సందడి

తెలుగు సినీ ప్రేక్షకులకు థియేటర్ సినిమాలంటే మక్కువెక్కువ. హీరోల అభిమానంపై కొందరు థియేటర్స్కి వెళితే.. మరికొందరు సినిమా సబ్జెక్టుని బట్టి వెళతారు. ఇంకొందరైతే.. సరదాగా 'షో' వేసేద్దాం అనే ఆలోచనతో వెళ్లి చూస్తారు. అయితే, ఎవ్వరు ఏ విధంగా వెళ్లిన.. థియేటర్ సినిమాను ఎంజాయ్ చేయడానికే అనేది మాత్రం పక్కా! ఈ క్రమంలోనే ఆడియన్స్ ముందర పండుగ వచ్చిందంటే, అపుడు థియేటర్లో జాతర మొదలైనట్టే అని అర్ధం. అంతేకాదండోయ్ మన తెలుగు ఆడియన్స్.. పండుగ వచ్చిందంటే చాలు.. థియేటర్ సినిమాల వైపు లుక్కేస్తారు. ఈ తరుణంలో రానున్న వినాయక చవితికి రిలీజ్ కానున్న సినిమాలు ఏంటనే దానిపై సెర్చ్ చేయడం మొదలెట్టారు. మరి చవితి థియేటర్ స్పెషల్ సినిమాలు ఏవో చూద్దాం..  

సుందరకాండ:

నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన చిత్రం ‘సుందరకాండ’. శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని హీరోయిన్స్‌‌‌‌గా నటించగా, నరేష్, వాసుకి కీలక పాత్రలు పోషించారు. చవితి స్పెషల్గా రేపు (ఆగస్టు 27న) సినిమా విడుదల కానుంది. ఈ మూవీ రొమాంటిక్ కామెడీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్గా రానుంది.

కథ: తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి కొన్ని క్వాలిటీస్ ఉండాలనుకుంటాడు నారా రోహిత్. అలాంటి అమ్మాయి కోసం ఎన్నాళ్లైనా వెయిట్ చేస్తుంటాడు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మాత్రం ఎలా అయినా తన పెళ్లి చేయాలనుకుంటారు. అలాంటి సందర్భంలో ఒకేసారి తన లైఫ్‌‌లోకి  ఇద్దరు అమ్మాయిలు  వస్తే.. వారిని ఎలా హ్యాండిల్ చేశాడనేది కథ.  

ALSO READ : ‘మిరాయ్’ ట్రైలర్ అప్డేట్..

‘త్రిబాణధారి బార్బరిక్’:

సత్యరాజ్‌‌, వశిష్ట ఎన్‌‌ సింహ, ఉదయభాను లీడ్ రోల్స్‌‌లో తెరకెక్కిన చిత్రం మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించాడు. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించారు. ఆగస్టు 29న సినిమా రిలీజ్ కానుంది.

మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు బార్బరీకుడు పాత్ర ఆధారంగా మూవీ తెరకెక్కింది. ఇందులో హీరో, విలన్‌ అంటూ ఎవ్వరూ ఉండరు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు మైథలాజికల్ టచ్ ఇస్తూ, ప్రతి పాత్రకు భిన్న పార్శ్వాలతో రానుందని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. 

‘అర్జున్ చక్రవర్తి’:

విజయ రామరాజు హీరోగా నటించిన  స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించారు. ఆగస్టు 29న సినిమా రిలీజ్. కబడ్డీ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో మూవీ తెరకెక్కింది. నల్గొండలో కబడ్డీ ప్లేయర్ నాగులయ్య, అతనిని అర్జున్ అని కూడా పిలుస్తారు. ఆయన జీవితంలోని రియల్ ఇన్సిడెంట్స్‌‌‌‌ అరవై శాతం ఉంటే, నలభై శాతం ఫిక్షన్‌‌‌‌ను జోడించి కథను రెడీ చేశారు విక్రాంత్‌‌‌‌. టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. 

కన్యాకుమారి:

గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా సృజన్ అట్టాడ దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘కన్యా కుమారి’. నటి మధు శాలిని ఈ చిత్రానికి ప్రెజెంటర్‌‌‌‌గా వ్యవహరిస్తోంది. రూరల్ లవ్‌‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా గణేష్ చతుర్ధి సందర్భంగా ఆగస్టు 27న విడుదల కానుంది. 

‘పరమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుందరి’:

సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ జంటగా నటించిన హిందీ మూవీ ‘పరమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుందరి’. తుషార్ జలోటా దర్శకత్వం వహించాడు. మడాక్ ఫిల్మ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దినేష్ విజన్ నిర్మించారు. ఆగస్టు 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

కథ: కేరళ అమ్మాయి సుందరిగా జాన్వీకపూర్, ఢిల్లీకి చెందిన పరమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సిద్ధార్థ్ మల్హోత్రా కనిపించనున్నారు. భాష, సంస్కృతులు, ఆచార వ్యవహారాల్లో భిన్న వ్యత్యాసాలు ఉన్న వీరిమధ్య చిగురించిన ప్రేమ చివరకు ఎలా గమ్యాన్ని చేరుకుంది అనేది మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.