MiraiTrailer: ‘మిరాయ్’ ట్రైలర్ అప్డేట్.. తేజ-మనోజ్ల భీకర యుద్దానికి టైం ఫిక్స్

MiraiTrailer: ‘మిరాయ్’ ట్రైలర్ అప్డేట్.. తేజ-మనోజ్ల భీకర యుద్దానికి టైం ఫిక్స్

యంగ్ హీరో తేజ సజ్జా-మంచు మనోజ్ నటించిన మూవీ మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని యాక్షన్-అడ్వెంచర్గా తెరకెక్కించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. సెప్టెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ మూవీ సెప్టెంబర్ 12న విడుదలకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా ఇవాళ (ఆగస్టు 26న) మిరాయ్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గురువారం ఆగస్టు 28న ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో తేజ సజ్జా శక్తితో కూడిన స్టిక్ పట్టుకోగా, పదునైన ఖడ్గంతో మనోజ్ కనిపిస్తున్నారు. వీరిద్దరూ తమ ఆయుధాలతో తలపడుతున్న ఈ పోస్టర్ కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాంగ్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఇందులో తేజ సూపర్ యోధ అవతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించబోతున్నాడు. రితికా నాయక్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నాడు. శ్రియా శరణ్, జగపతిబాబు, జయరామ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

►ALSO READ | Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ విడుదల వాయిదా.. 

హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 12న 2డి, 3డి ఫార్మాట్స్‌‌‌‌‌‌‌‌లో ఎనిమిది భాషల్లో సినిమా విడుదల కానుంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కరణ్ జోహర్ హిందీలో రిలీజ్ చేస్తున్నారు.