Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ విడుదల వాయిదా.. కారణం వెల్లడించిన మేకర్స్

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ విడుదల వాయిదా..  కారణం వెల్లడించిన మేకర్స్

రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’.ఆగస్టు 27న విడుదల కావాల్సిన ఈ మూవీని పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. ఈ విషయాన్నీ మూవీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసి, వాయిదా పడటానికి గల కారణాన్ని వెల్లడించింది. 

‘‘ఇటీవలి సినీ పరిశ్రమ సమ్మెలతో బంద్ కొనసాగడం చేత, ‘మాస్ జాతర’ షూటింగ్ కంప్లీట్ చేయలేకపోయాం. ఈ ఊహించని జాప్యాల కారణంగా కీలకమైన కంటెంట్‌ను పూర్తి చేయడంలో ఆలస్యమైంది. అందువల్ల ఆగస్టు 27న విడుదల చేయాల్సిన ‘మాస్ జాతర’ అనుకున్న టైంకి ప్రేక్షకులు ముందుకు రావడం లేదు. త్వరలోనే థియేటర్లలో అతిపెద్ద మాస్ విందును అందించడానికి చిత్ర బృందం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. మరో కొత్త రిలీజ్ డేట్ని త్వరలో ప్రకటిస్తామని’’ సితార సంస్థ తెలిపింది.

అయితే, ఈ మూవీ వినాయక చవితి నుంచి దీపావళికి షిఫ్ట్ అయినట్లు సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాతో పాటు తేజ సజ్జా నటించిన మిరాయ్ సైతం విడుదల తేదీని మార్చుకున్నట్లు టాక్. సెప్టెంబర్ 5, 2025 నుండి సెప్టెంబర్ 12, 2025కి మారినట్లు తెలుస్తోంది. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా, ఇక ఈ లేటెస్ట్ అప్డేట్తో రవితేజ ఫ్యాన్స్లో ఓ క్లారిటీ వచ్చింది.

►ALSO READ | The Girlfriend: సోల్ ఫుల్ మెలోడీతో.. రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సెకండ్ సింగిల్..

రవితేజ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 75వ చిత్రం. రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.