The Girlfriend: సోల్ ఫుల్ మెలోడీతో.. రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సెకండ్ సింగిల్..

The Girlfriend: సోల్ ఫుల్ మెలోడీతో.. రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సెకండ్ సింగిల్..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ (The Girlfriend). రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. రష్మికకు జోడిగా దీక్షిత్ శెట్టి నటించాడు. ఇవాళ (ఆగస్ట్ 26న) మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘మనసా.. తెలుసా.. ఏం జరుగుతోంది..’ అనే ఈ పాట ఆడియన్స్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

కాలేజీ నేపథ్యంలో సాగే ఈ పాటకు సోల్ ఫుల్ లిరిక్స్ అందించారు రాకేందు మౌళి. హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరచిన ఈ మెలోడీ సాంగ్ను చిన్మయితో కలిసి పాడారు. ఇప్పటికే, మూవీ ప్రమోషన్స్లో రిలీజైన ' నదివే' వీడియో సాంగ్ శ్రోతలను వీపరీతంగా ఆకట్టుకుంటుంది. త్వరలో మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. 

రష్మిక మందన్నసినిమాల విషయానికి వస్తే.. యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర సినిమాలతో మంచి సక్సెస్ జోష్లో ఉంది. తెలుగులోనే కాదు ఇండియాలోనే ఏ హీరోయిన్కు సాధ్యం కాని రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం రష్మిక చేతిలో 'ది గర్ల్‌ఫ్రెండ్', 'రెయిన్‌బో' మరియు 'పుష్ప 3', మైసా, థామ వంటి మూవీస్ తో పాటుగా మరిన్ని లైన్లో ఉన్నాయి.

►ALSO READ | Coolie vs War 2: రూ.500 కోట్ల క్లబ్లో తలైవా ‘కూలీ’.. ఎన్టీఆర్ ‘వార్ 2’ మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?