Coolie vs War 2: రూ.500 కోట్ల క్లబ్లో తలైవా ‘కూలీ’.. ఎన్టీఆర్ ‘వార్ 2’ మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?

Coolie vs War 2: రూ.500 కోట్ల క్లబ్లో తలైవా ‘కూలీ’.. ఎన్టీఆర్ ‘వార్ 2’ మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?

రజనీకాంత్-నాగార్జున నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’. ఈ మూవీ విడుదలైన రెండవ వారంలోనూ బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో యాక్షన్ థ్రిల్లర్ కూలీ ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 14న విడుదలైన ఈ మూవీ 12 రోజుల్లోనే ఈ రికార్డ్ మార్క్ అందుకున్నట్లు తెలిపాయి.

ఈ సందర్భంగా రజనీకాంత్ ఖాతాలో రూ.500 కోట్లు సాధించిన చిత్రాల్లో కూలీ మూడవ చిత్రంగా నిలిచింది. గతంలో రోబో 2.0, జైలర్ సినిమాలు ఈ ఫీట్ సాధించాయి. ఈ క్రమంలో రజినీ ఖాతాలో మూడు 500 కోట్ల మార్క్ సినిమాలను సాధించి తలైవా తన పవర్ చూపించారు. అంతేకాకుండా.. మూడు 500కోట్ల సినిమాలను అందించిన ఏకైక తమిళ హీరోగా రజినీకాంత్ నిలిచారు.

►ALSO READ  ‘డు యూ వనా పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’.. మరో కొత్త సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకు తమన్నా

కూలీ రెండవ సోమవారం (ఆగస్ట్ 25న) ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.2.52 కోట్ల నెట్ సాధించింది. ఇలా మొత్తం 12 రోజుల్లో కూలీ రూ.259 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వెబ్ సైట్ సక్నిల్క్ వెల్లడించింది. ఈ క్రమంలో కూలీకి పోటీగా వచ్చిన వార్ 2ను సైతం అధిగమించింది.

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్ 2 కూడా ఆగస్టు 14నే రిలీజైంది. వార్ 2 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతోనే ప్రారంభమైంది. ఫస్ట్ డే (గురువారం) రూ.52 కోట్ల నెట్ వసూలు చేసింది. రెండవ రోజు (శుక్రవారం) కూడా రూ. 57.85 కోట్లతో అదే ఊపు కొనసాగించింది. అయితే, వీకెండ్ వచ్చేసరికి వసూళ్ళలో తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో వార్ 2 ఇండియా బాక్సాఫీస్ వద్ద 12 రోజుల్లో రూ.224కోట్లకి పైగా నెట్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.337 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసినట్లు తెలిపాయి.