యెజ్డీ అడ్వెంచర్​ప్రీమియం బైక్ వచ్చేసింది..ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే

యెజ్డీ అడ్వెంచర్​ప్రీమియం బైక్ వచ్చేసింది..ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే

2025 యెజ్డి అడ్వెంచర్ మన దేశ మార్కెట్లో రూ.2.15 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో లాంచ్ అయింది. బేస్ మోడల్, ఫారెస్ట్ గ్రీన్ వేరియంట్ ధర రూ. 2.15 లక్షలు, టాప్-ఎండ్ వోల్ఫ్ గ్రే THL వేరియంట్ ధర రూ.2లక్షల 26వేల900. బుకింగ్‌లు ఇప్పుడు తెరిచి ఉన్నాయి ,అన్ని జావా యెజ్డి డీలర్‌షిప్‌లలో టెస్ట్ రైడ్‌లు అందుబాటులో ఉన్నాయి.   

2025 యెజ్డి అడ్వెంచర్ కొత్త డిజైన్ తో వచ్చింది. ఇందులో కొత్త ట్విన్-పాడ్ హెడ్‌లైట్, మోడిఫైడ్ చేసిన టెయిల్‌లైట్,కొత్త ముక్కు లాంటి ఫ్రంట్ ఫెండర్ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఎత్తు-సర్దుబాటు చేయగల విండ్‌షీల్డ్‌తో వస్తుంది.   

ట్రాక్షన్ కంట్రోల్: ఈ మోటార్ సైకిల్ మూడు-మోడ్ ABS తో పాటు సెగ్మెంట్-ఫస్ట్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ ,USB ఛార్జింగ్‌తో పూర్తిగా డిజిటల్, సర్దుబాటు చేయగల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంది. 

ఇక రంగుల విషయానికొస్తే 2025 యెజ్డి అడ్వెంచర్ ఆరు రంగు ఎంపికలలో లభిస్తుంది.ఫారెస్ట్ గ్రీన్, ఓషన్ బ్లూ, డెజర్ట్ ఖాకీ, టోర్నాడో బ్లాక్, వోల్ఫ్ గ్రే ,గ్లేసియర్ వైట్.   
ఇంజిన్ ,గేర్‌బాక్స్ మునుపటి మోడల్ లాగానే ఉన్నాయి. కానీ సున్నితమైన పవర్ డెలివరీ కోసం ఇంధన మ్యాపింగ్,గేర్ లో మార్పులు చేశారు.