చిప్​ కంపెనీల్లో 22 వేల ఉద్యోగాలు

చిప్​ కంపెనీల్లో 22 వేల ఉద్యోగాలు
  • 4 కంపెనీల్లోనే 12 వేల కొలువులు

న్యూఢిల్లీ : మనదేశంలో నాలుగు చిప్​తయారీ కంపెనీల ఫ్యాక్టరీలు నిర్మాణంలో ఉండగా, వీటికి వేల సంఖ్యలో ఉద్యోగులు అవసమని రిక్రూటింగ్​ సంస్థలు చెబుతున్నాయి.  స్పెషలిస్ట్ స్టాఫింగ్ సంస్థ ఎక్స్‌‌ఫెనో నుంచి వచ్చిన డేటా ప్రకారం, కేన్స్ టెక్నాలజీ, మైక్రోన్ టెక్నాలజీ, ఎస్​ఆర్​ఏఎం, ఎంఆర్​ఏఎం గ్రూప్ వంటి కంపెనీలు మొత్తం 12 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నాయి.  కేన్స్ టెక్నాలజీ 2,000 ఉద్యోగాల వరకు, , మైక్రోన్ టెక్నాలజీ 5,000 వరకు, ఎస్​ఆర్​ఏఎం, ఎంఆర్​ఏఎం కంపెనీలు సమిష్టిగా 5,000 ఉద్యోగాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

మిగతా సంస్థల నుంచి మరో పది వేల జాబ్స్ వస్తాయని అంచనా. ఇవి తమ ప్లాంట్లను పెద్ద ఎత్తున విస్తరిస్తుండటంతో సెమీకండక్టర్ ఉద్యోగాలకు డిమాండ్ గత సంవత్సరంతో పోలిస్తే మరింత ఎక్కువగా ఉంటుందని వర్క్‌‌ఫోర్స్ మేనేజ్‌‌మెంట్ సంస్థ ఎక్స్‌‌ఫెనో రీసెర్చ్‌‌లోని ఇంజనీరింగ్ సర్వీసెస్ బిజినెస్ హెడ్ కాంతరాజు సంజీవప్ప అన్నారు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ ఫాబ్రికేషన్, పెద్ద-స్థాయి సర్క్యూట్ల తయారీ, ఫౌండ్రీ ఎస్టాబ్లిష్​మెంట్​,  సిలికాన్ ప్రాసెసింగ్ లేదా సెమీకండక్టర్ సింథసిస్ వంటి జాబ్స్​కు భారీ ఎత్తున డిమాండ్​ ఉంది.

"సెమీకండక్టర్ల తయారీ రంగం  రెండంకెల వృద్ధిని సాధిస్తోంది, ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు,  డిజైన్ నిపుణుల కోసం కంపెనీలు చూస్తున్నాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, డిజైన్, టెస్టింగ్  సెమీకండక్టర్ భాగాల తయారీలో ఇంజినీరింగ్ నైపుణ్యాలకు డిమాండ్ ఉంది" అని టీమ్‌‌లీజ్ ఎడ్‌‌టెక్ ఎంప్లాయబిలిటీ బిజినెస్ హెడ్  చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జైదీప్ అన్నారు. ధోలేరా, సనంద్,  అస్సాంలో రాబోయే నాలుగు సెమీకండక్టర్ల తయారీ కేంద్రాల వల్ల రాబోయే సంవత్సరాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు రావొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

ఈ డొమైన్లకు డిమాండ్​ అధికం

సెమీకండక్టర్ కంపెనీలు  ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, హార్డ్‌‌వేర్  సాఫ్ట్‌‌వేర్ డెవలప్‌‌మెంట్,  టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ వంటి డొమైన్‌‌లలో డిజైన్, తయారీ,   పరిశోధన, అభివృద్ధిలో పనిచేయడానికి భారీగా నిపుణులను నియమించుకుంటున్నాయని రిక్రూటింగ్ సంస్థలు పేర్కొన్నాయి. సెమీకండక్టర్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్  ఫ్యాబ్రికేషన్లు పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నైపుణ్యాలని మ్యాన్‌‌పవర్ కన్సల్టింగ్ సంస్థలు చెబుతున్నాయి.  సెమీకండక్టర్ స్పేస్‌‌లో సెమీకండక్టర్ ఇంజనీరింగ్ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు మొత్తం వర్క్‌‌ఫోర్స్‌‌లో 28 శాతం ఉన్నారు.

తర్వాత మెకానికల్ ఇంజనీర్లు 19 శాతం,  ఎంబెడెడ్ సిస్టమ్‌‌లో 15.5 శాతం ఉన్నారు. ఉద్యోగాలు ఎంట్రీ లెవల్‌‌లో సెమీకండక్టర్ టెక్నీషియన్ నుంచి సీనియర్ డిజైన్ ఆర్కిటెక్ట్ లేదా మేనేజిరియల్ స్థానాల వరకు ఉంటాయి. ఎక్స్​ఫెనో డేటా ప్రకారం, పరిశ్రమలో ఎంట్రీ-లెవల్ ఉద్యోగాల కోసం సగటు ప్యాకేజీలు సంవత్సరానికి రూ. 6–-8 లక్షల వరకు ఉంటాయి. సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్  ప్యాకేజింగ్ రంగం భారతదేశంలో విస్తరిస్తున్నందున

 ప్రాసెస్ ఇంజనీర్, ఇంటిగ్రేషన్ ఇంజనీర్, టెస్టింగ్ ఇంజనీర్, మిడిల్‌‌వేర్ ఇంజనీర్, ఆప్టోఎలక్ట్రానిక్స్  మెకాట్రానిక్స్‌‌లో కన్సల్టెంట్‌‌ వంటి ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయని ఈ రంగానికి చెందిన ఒక ఎక్స్​పర్ట్​ వివరించారు.  సెమీకండక్టర్ తయారీ కోసం ప్రత్యేకమైన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కొరత కూడా ఎక్కువగా ఉందని చెప్పారు.