
కెనడాలోని హాలిఫాక్స్‌లో 1826 కట్టిన విక్టోరియన్ ఎల్మ్ వుడ్ హోటల్ ఇది. చరిత్రాత్మకమైన ఈ బిల్డింగ్ పాతబడిందని అధికారులు కూల్చివేతకు ఆదేశించారు. అయితే, ఈ బిల్డింగ్‌ను కాపాడతామంటూ గెలాక్సీ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ముందుకొచ్చింది.
దీనిని కొని, పక్కనే కొత్త పునాది వేసి, దానిపైకి చేర్చాలని ప్లాన్ వేసింది. 220 టన్నుల బరువైన ఈ బిల్డింగ్‌ను పక్కకు జరిపింది. ఇందుకోసం రోలర్స్కు బదులుగా 700 ఐవరీ సబ్బులను ఉపయోగించడం అసలు విశేషం. సబ్బుల మీదుగా బిల్డింగ్ మెల్లగా జారుకుంటూ 30 ఫీట్లు పక్కకు జరిగింది. - హాలిఫాక్స్