రాష్ట్రానికి చెందిన 23మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్లు సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. మరో రెండు రోజుల్లో పంజాబ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో 117మంది ఎమ్మెల్యేలకు కరోనా టెస్ట్ లు చేయంగా అందులో 23మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకిందని తెలిపారు.
జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏడుగురు ఎన్ డీఏ ముఖ్యమంత్రులతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కాన్ఫరెన్స్ లో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ తాను అసెంబ్లీ సమావేశాలకు ముందు సభలో పాల్గొనే ఎమ్మెల్యేలందరూ కరోనా టెస్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పగా..అందులో మొత్తం 117మంది ఎమ్మెల్యేలకు 23మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకిందని వివరించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో కరోనా ఘోరంగా వ్యాపిస్తుందో ఊహించవచ్చని అమరీందర్ సోనియాగాంధీకి తెలిపారు.
