- హైదరాబాద్ చరిత్ర పరిశోధన బృందం సేకరణ
- స్టేట్ మ్యూజియంలో సందర్శకుల కోసం ప్రదర్శన
కోటపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లా అడవుల్లో 230 మిలియన్ సంవత్సరాలకు చెందిన శిలాజాలను (పాజిల్స్) హైదరాబాద్ కు చెందిన చరిత్ర పరిశోధన బృందం సేకరించింది. సింగరేణి కాలనీ సిబ్బందితో కలిసి సంయుక్తంగా గురువారం చెన్నూరు, కోటపల్లి మండలాల పరిధిలోని బొప్పారం ఫారెస్ట్ డివిజన్ లో శిలాజాల కోసం వెతికారు. వృక్ష, జంతువులకు సంబంధించిన శిలాజాలను సేకరించారు.
వీటిని తెలంగాణ స్టేట్ మ్యూజియంలో సందర్శకుల కోసం ప్రదర్శనకు అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర పురావస్తు శాఖ డిఫ్యూటీ డైరెక్టర్ పి.నాగరాజు తెలిపారు. శిలాజాల సేకరణలో అసిస్టెంట్ డైరెక్టర్ మల్లు నాయక్, ఎన్. సాగర్ అసిస్టెంట్ డైరెక్టర్, కరీంనగర్, రామగుండం సింగరేణి కాలరీస్ సిబ్బంది డీజీఎం హనుమంత్ జియాలజిస్ట్, చైన్ మెన్ దేవేందర్ పాల్గొన్నారు.
