సమగ్ర శిక్ష ప్రపోజల్స్ రూ.2,300 కోట్లు

సమగ్ర శిక్ష ప్రపోజల్స్ రూ.2,300 కోట్లు
  •  ఈ నెల 15, 16 తేదీల్లో  పీఏబీ సమావేశం 

హైదరాబాద్, వెలుగు : సమగ్ర శిక్ష  ప్రాజెక్టు (ఎస్ఎస్ఏ) ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే (2024–25) నిధులు పెంచే అకాశాలు కనిపించడం లేదు. ఈసారి కూడా గతేడాది ఇచ్చిన నిధులే ఇవ్వాలని  కేంద్రం యోచిస్తున్నది. దానికి అనుగుణంగానే ప్రపోజల్స్ పంపించాలని రాష్ట్రానికి సూచించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 15, 16 తేదీల్లో ఢిల్లీలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు అవ్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి  స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేనతో పాటు ఎస్ఎస్ఏ అడిషనల్ డైరెక్టర్ రమేశ్, ఇతర సమగ్ర శిక్ష అధికారులు హాజరుకానున్నారు. 

వచ్చే ఏడాదికిగాను మొత్తం రూ.2300 కోట్లతో ప్రపోజల్స్ రెడీ చేశారు. అయితే, తెలంగాణకు కేవలం రూ.1,900 కోట్లు మాత్రమే ఇచ్చే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి.  సమగ్ర శిక్షలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల పెంపు ప్రతిపాదనలు పెట్టినట్టు తెలిసింది. గత ప్రభుత్వం 30% జీతాల పెంపునకు అనుగుణంగా వాటి ప్రపోజల్స్ రెడీ చేశారు.